రథసప్తమి

సకల చరాచర జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు. మాఘశుద్ధ సప్తమి నాడు అదితి, కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. ఆ రోజునే సప్తాశ్వా రథారూఢుడై ప్రపంచానికి దర్శనమివ్వడంతో రథసప్తమిగా వేడుకలను జరుపుకొంటాం. రథంలోని భాగాలు సమయాన్ని, రుతువులను పేర్కొంటాయి. ఉత్తరదిశవైపు సూర్యుడి ప్రయాణం...

Published : 28 Jan 2017 19:51 IST

రథసప్తమి

ఫిబ్రవరి 3

సకల చరాచర జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు. మాఘశుద్ధ సప్తమి నాడు అదితి, కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. ఆ రోజునే సప్తాశ్వా రథారూఢుడై ప్రపంచానికి దర్శనమివ్వడంతో రథసప్తమిగా వేడుకలను జరుపుకొంటాం. రథంలోని భాగాలు సమయాన్ని, రుతువులను పేర్కొంటాయి. ఉత్తరదిశవైపు సూర్యుడి ప్రయాణం ప్రారంభమవుతుంది. దైవారాధనలో సూర్యుని ఆరాధనకు విశిష్టమైన స్థానముంది. ప్రత్యక్షంగా సూర్యుడు దర్శనమిస్తాడు. సూర్యుని వెలుగులు లేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది. వ్యవసాయానికి, మానవులకు, జంతువులకు, ఇతర
జీవజాలానికి సూర్యుని కిరణాలే ఆధారం. సూర్యురశ్మి లేని ప్రపంచాన్ని తలచుకుంటే భయంతో వణికిపోతాం. సూర్యనమస్కారాలు చేయడం ఆరోగ్యరీత్యా కూడా మంచిదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని అగస్త్యమహర్షి అనుగ్రహం చేత పొంది రావణ సంహారం చేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. మహాభారతంలో మహాబలుడిగా పేరొందిన కర్ణుడు సూర్యానుగ్రహం చేత కుంతికి జన్మించాడు. మణులలో విశిష్టమైన శమంతకమణిని సత్రాజిత్తు సూర్యుని ఆరాధనతో పొందాడు. వైవస్వత మన్వంతరంలో మొదటి తిథి రథసప్తమి. ఈ పర్వదినాన జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులను తలపై ఉంచి అభ్యంగనస్నానం చేయిస్తారు. ఆదిత్యుని ఆరాధన మానవులను ఎంతో పునీతం చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు