Jiddu Krishnamurti: లక్ష్య సాధనలో రాజీ కూడదు
యవ్వనం అంటే ఏమిటని అడిగాడో శిష్యుడు. దానికి జిడ్డు కృష్ణమూర్తి ‘పురాణ పురుషులకు వయసుతో సంబంధం లేదు.
యవ్వనం అంటే ఏమిటని అడిగాడో శిష్యుడు. దానికి జిడ్డు కృష్ణమూర్తి ‘పురాణ పురుషులకు వయసుతో సంబంధం లేదు. రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, నలుడు, మారుతి, మార్కడేయుడు- తదితరుల జీవితాలు వయసుతో నిమిత్తం లేకుండా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి, ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి, అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగాలి... అని తెలియ జేస్తాయి. లక్ష్య సాధనకు బలమైన దేహంతో పాటు నిశిత బుద్ధి ఉండాలి. అవి ఉన్నందునే వారంతా మన హృదయాల్లో నిత్యయవ్వనులుగా నిలిచిపోయారు. నిజానికి వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో వయసు. కానీ లక్ష్య సాధనకు వారి వయసు అడ్డు కాలేదంటే నిర్దేశించుకున్న లక్ష్యాలు నిత్యయవ్వనాన్ని ప్రసాదించాయని అర్థం. లక్ష్య సాధనలో రాజీ కూడదు. లేదంటే యవ్వనానికి వ్యాధి సోకి నట్లవుతుంది. గమ్యం చేరకుండా మధ్యలో నిరాశకు లోనయితే యవ్వనంగా ఉంచడానికి బదులు జీవచ్ఛవంలా మారుస్తుంది. నదులకు సముద్రుణ్ణి చేరడమే లక్ష్యం. మధ్యలో అవరోధాలుంటే దిశను మార్చుకుని తిరిగి సముద్రుడి వైపు సాగుతాయే కానీ చెరువుల్లోకి మళ్లవు. యవ్వనంగా ఉండాలంటే మన కళ్లల్లో, కలల్లో లక్ష్యాలే మెదులుతుండాలి. అప్పుడే మనలో అనంతశక్తి ప్రవేశిస్తూ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ధర్మకార్యాల నిర్వహణకు ప్రోద్బలం అందిస్తుంది’ అంటూ వివరించారు.
పద్మజ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?