Sri Rama: శ్రీరామునిలో ఉన్న 16 గుణాలు.. మీకు తెలుసా?
దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకీ రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం ‘శ్రీరామాయణం’. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది.
ఇంటర్నెట్‌డెస్క్: దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకీ రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం ‘శ్రీరామాయణం’. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు ‘పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి’ అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు పడిన కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దాన గుణముతో దీనులను గెలిచాడు. అలాగే, తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం.
కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః |
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||
ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే.. 1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11.ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15.ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ukraine : యుద్ధం ముగిసిన వెంటనే అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు పెట్టుబడులు : జెలెన్ స్కీ
-
Chandrababu Arrest: చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరిన సీఐడీ
-
Chandrababu Arrest: మహిళా శక్తి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. విశాఖలో ఉద్రిక్తత
-
Apple Devices: యాపిల్ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్
-
Atlee: హాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది.. స్పానిష్ ఫిల్మ్ తీయొచ్చేమో: ‘జవాన్’ డైరెక్టర్
-
Chandrababu Arrest: ముగిసిన చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ