Guinness World Record: ఒకే కారులో 27 మంది యువతులు!

ఓ మినీ సైజు కూపర్‌ కారులో మామూలుగా అయితే ఎంతమంది ఎక్కగలరు? నలుగురు నుంచి ఆరుగురు.. కానీ ఆ వాహనంలో ఏకంగా 27మంది యువతులు ఎక్కి.........

Updated : 11 Sep 2022 21:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ మినీ సైజు కూపర్‌ కారులో మామూలుగా అయితే ఎంతమంది ఎక్కగలరు? నలుగురు నుంచి ఆరుగురు.. కానీ ఆ వాహనంలో ఏకంగా 27మంది యువతులు ఎక్కి ప్రతిష్ఠాత్మక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌ రికార్డ్స్‌ సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ మినీ కూపర్‌ కారులో ఒకరిపై ఒకరు మొత్తంగా 27మంది వాలంటీర్లు ఎక్కారు. అయితే, ఈ రికార్డును 2014లోనే సాధించినప్పటికీ.. ఇందుకు సంబంధించిన వీడియోను ఈనెల 6వ తేదీన సంస్థ పంచుకుంది.

ఎక్కువమంది పట్టేలా కారు సీట్లను సర్దుబాటు చేసి ఒకరిపై ఒకరు ఎక్కారు. స్టీరింగ్‌కు, ముందు అద్దానికి మధ్య కూడా ఒకరు పడుకోగా.. డిక్కీలోనూ నలుగురు ఎక్కడం గమనార్హం. ఇలా మొత్తంగా ఆ కారులో 27మందిని ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఒకే కారులో అంతమందిని కుక్కడం బాగుంది కానీ.. దాన్ని నడపలేరు కదా. ఒకవేళ నడిపినా అది చట్టపరంగా నేరం కదా అంటూ’ అంటూ ఓ నెటిజన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని