Video: భారత్‌ 75 ఏళ్ల ప్రయాణం.. 2 నిమిషాల వీడియోలో..!

భారత్‌ సాధించిన విజయాలకు ఓ వీడియో రూపం ఇచ్చింది గూగుల్‌. 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ‘ఇండియాకా ఉడాన్‌’ పేరుతో దీన్ని విడుదల చేసింది.

Updated : 10 Aug 2022 10:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్యాంగం రూపొందించుకోవడం.. ఎన్నికలు నిర్వహించుకోవడం.. ఇలా బ్రిటిష్‌ వాళ్ల నుంచి స్వాతంత్ర్యం సాధించిన తొలినాళ్లలో భారత్‌ అడుగులివీ. ఆ తర్వాత 75 ఏళ్ల కాలంలో మన దేశం అనేక మైలురాళ్లను అధిగమించింది. హరిత విప్లవం.. అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపడం మొదలు.. క్రికెట్‌ ప్రపంచకప్‌ను ముద్దాడడం వరకు అనేక ఘనతలు సాధించింది. ఒకప్పుడు టెక్నాలజీయే పరిచయం లేని దేశం.. నేడు డిజిటల్‌ చెల్లింపుల్లో అగ్రగామిగా నిలిచింది. ఇలా చెప్పుకొంటూ పోతుంటే భారత్‌ సాధించిన విజయాలెన్నో. వీటన్నింటికీ ఓ వీడియో రూపం ఇచ్చింది గూగుల్‌. 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ‘ఇండియాకా ఉడాన్‌’ పేరుతో దీన్ని విడుదల చేసింది. ఆ వీడియో మీరూ చూసేయండి..



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని