Viral Video: మన బుల్లెట్ బండి రేంజులో.. టాలెంట్ చూపిన కేరళ వధువు..!
గురువాయుర్: వివాహ ఘడియలు సమీపిస్తుంటే వధూవరుల కుటుంబాల్లో చెప్పలేని ఆనందం నిండి ఉంటుంది. ఆ సంతోష సమయానికి మరింత శోభ తీసుకువచ్చారు కేరళకు చెందిన ఓ యువతి. పెళ్లి వేదిక వద్దనే ఎంతో ఉత్సాహంతో ఆమె డ్రమ్స్ వాయించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో యువతి సంగీత వాయిద్యం చెందా(chenda)ను వాయిస్తూ కనిపించారు. పెళ్లి కుమార్తెగా ముస్తాబై.. వేదిక ముందే నిల్చొని ఎంతో ఉత్సాహంగా ఆమె తన కళను ప్రదర్శించారు. ఆమె వెంట ఉన్న మరికొందరు వ్యక్తులు ఒకే రిథమ్‌లో ఆమెకు జతకలిశారు. ‘గురువాయుర్ ఆలయంలో వివాహ వేడుక జరిగింది. వధువు తండ్రి చెందాయ్ మాస్టర్. ఆమె దానిని వాయిస్తుంటే..తండ్రి, వరుడు కూడా వచ్చి చేరారు’ అని ఓ నెటిజన్ ఆ వీడియోను షేర్ చేశారు. సంగీత వాయిద్యంపై ఆమెకున్న పట్టు నెటిజన్లను మెప్పించింది. ‘వధూవరుల ముఖాల్లో సంతోషం మంత్రముగ్ధులను చేస్తోంది. చివర్లో ఆమె తండ్రి వచ్చి చేరడం బాగుంది’ అని ఒకరు స్పందించారు. ‘ఈ వీడియోలో ఆమే స్టార్. ఆమె ముఖకవళికలు, ఆహార్యం, ఎనర్జీ కట్టిపడేస్తున్నాయి’ అంటూ మరొకరు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు.. సంతోషంలో దర్శకధీరుడు
-
Movies News
Paruchuri Gopala Krishna: ‘ధమాకా’.. ఆ సీన్ చీటింగ్ షార్ట్లా అనిపించింది..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Arshdeep Singh: అర్ష్‌దీప్ ఎనర్జీ అంతా అక్కడే వృథా అవుతోంది: భారత మాజీలు
-
Politics News
Viveka murder Case: సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
-
India News
IAF: వాయుసేనకు భారీ నష్టం.. ఒకేసారి కూలిన మిరాజ్, సుఖోయ్ యుద్ధ విమానాలు