Viral Video: దీపావళి మాట దేవుడెరుగు..ప్రాణాలు జాగ్రత్త తల్లీ..వీడియో వైరల్‌

అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో ఉన్న ఇంటి కిటికీలను ఓ మహిళ శుభ్రం చేస్తోన్న తీరుకు అవాక్కవక మానరు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Published : 21 Oct 2022 22:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పండగల సీజన్‌ వచ్చిందంటే.. కొత్త దుస్తులు కొనుక్కోవడం, పిండివంటలు రుచి చూడటం గురించి ఎదురుచూస్తుంటాం..!  వీటన్నింటి కంటే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన ఓ పెద్ద ప్రక్రియ కూడా ఉంటుంది. ఇంటిని తళతళ మెరిపించాలని ఎవరికి(ముఖ్యంగా మహిళలు) తోచిన రీతిలో వారు క్లీన్ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియో చూస్తే మాత్రం వామ్మో అనక మానరు. అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో ఉన్న ఇంటి కిటికీలను ఓ మహిళ శుభ్రం చేస్తోన్న తీరు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. సదరు మహిళ నాలుగో అంతస్తులో కిటికీ  బయటవైపు కొసపై నిల్చొని పైనున్న అద్దాలను క్లీన్ చేసింది. ఎలాంటి తొణుకుబెణుకు లేకుండా చకచకా పనిచేసుకుంటూ పోయింది. 

ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ‘ఈ పండక్కి కనక మహాలక్ష్మి ఆమె ఇంటికి రాకపోతే.. ఇంక ఎవరికి ఇంటికి రారు’, ‘ఇలాంటి స్టంట్స్‌ నిపుణులే చేస్తారు. సాధారణ వ్యక్తులు వాటికి దూరంగా ఉండండి’, ‘వామ్మో.. నాకు గుండె ఆగినంత పనైంది’..అని కొందరు ట్వీట్లు చేయగా.. మరొకరు ‘ఇంత రిస్క్ చేస్తున్నది ఆ ఇంటి యజమానురాలా..? లేక  సహాయకురాలా..?’ అని అనుమానం వ్యక్తం చేశారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని