Viral Video: నడిరోడ్డుపై ‘విచ్చలవిడి’గా.. బైక్‌పై వికృత చేష్టలు.. వీడియో వైరల్!
జైపూర్: ఇటీవలి కాలంలో కొన్ని జంటలు నడిరోడ్డుపై వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బైక్‌పై వెళుతూ యువతి, యువకుడు అపసవ్య దిశలో కూర్చొని రొమాన్స్ చేస్తోన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పబ్లిక్ డిస్‌ప్లేన్ ఆఫ్ అఫెక్షన్‌గా (PDA) పిలిచే ఈ తరహా ఘటనలు గతంలో విశాఖపట్నం(Visakhapatnam), యూపీలోని లఖ్‌నవూ(Lucknow), ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ (Bhilai)లలో చోటుచేసుకోగా.. తాజాగా రాజస్థాన్(Rajasthan)లోని అజ్మీర్(Ajmer)లో అలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. అజ్మీర్‌లోని కాలేజ్ క్రాస్ రోడ్-నౌసర్ వ్యాలీ రహదారిపై ఓ ప్రేమ జంట బైక్‌పై వికృత చేష్టలు రోడ్డుపై వెళ్తున్నవారిని షాక్‌కు గురిచేసింది. అదే సమయంలో రోడ్డుపై వెళుతున్న కొందరు వాహనదారులు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై అజ్మీర్ పోలీసులు స్పందించారు. ఆ జంటను అదుపులోకి తీసుకుని బైక్‌ను సీజ్ చేసినట్లు ట్వీట్ చేశారు. వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు మాత్రం ఆ జంట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌పై ఇలా ప్రమాదకర రీతిలో ప్రయాణించడం, రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులకు ఆటంకం కలిగించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని కామెంట్లు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చట్టం తీసుకురావాలని మరికొంతమంది నెటజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగ మార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు