Viral Video: పెరుగు కోసం రైలును ఆపేశారు.. సస్పెండ్‌ అయ్యారు.. ఎక్కడంటే!

వ్యక్తిగత అవసరాల కోసం బైకు, కారు లేదా బస్సును రోడ్డు పక్కన ఆపిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ పెరుగు కోసం

Published : 10 Dec 2021 01:38 IST

లాహోర్‌: వ్యక్తిగత అవసరాల కోసం బైకు, కారు లేదా బస్సును రోడ్డు పక్కన ఆపిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ పెరుగు కోసం ఏకంగా ఓ రైలును ఆపిన ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగింది. లాహోర్ నుంచి దక్షిణ కరాచీ వైపు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను.. కన్హా స్టేషన్‌కు సమీపంలో లోకోపైలట్ ఆపారు. వెంటనే అసిస్టెంట్ లోకో పైలట్.. పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లి పెరుగు తీసుకుని తిరిగి ట్రైన్ ఎక్కారు. అయితే ఈ దృశ్యాలన్నింటినీ అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి. లోకోపైలట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. ఈ ఘటనపై రైల్వే అధికారులను ప్రశ్నిస్తూ పోస్టులు చేశారు. లోకోపైలట్‌ల తీరును తప్పు పట్టిన పాక్‌ రైల్వే మంత్రి.. బాధ్యుల్ని సస్పెండ్‌ చేశారు.

Read latest Viral Videos and Telugu News



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని