Published : 02 Dec 2022 01:35 IST

Anand Mahindra: ఆరుగురు కూర్చునే బండి.. ఆనంద్‌ మహీంద్రాను ఆకట్టుకుంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల వేదికగా వినూత్న ఆవిష్కరణలను ఎల్లప్పుడూ ప్రోత్సహించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra).. తాజాగా మరో కొత్త సృజనాత్మకతను ట్విటర్‌ వేదికగా నెటిజన్లకు పరిచయం చేశారు. చూడటానికి బైక్‌లా కనిపిస్తున్నా.. ఆరుగురు కూర్చునే విధంగా, వేర్వేరు సీట్లతో పొడవుగా రూపొందించిన ఓ బ్యాటరీ వాహనం వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఒకసారి ఛార్జింగ్‌ పెడితే దీనిపై దాదాపు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రూ.10-12 వేల వ్యయంతో ఈ వాహనాన్ని తయారు చేయొచ్చు’ అని అందులో ఓ యువకుడు చెబుతున్నట్లు ఉంది.

ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఐరోపాలోని రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాల్లో కనిపించే టూర్ బస్సులా.. కేవలం చిన్నపాటి డిజైన్‌ మార్పులతో ఈ వాహనాన్నీ అంతర్జాతీయంగా వినియోగించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఇక్కడ.. అవసరాలే ఆవిష్కరణలకు మూలం’ అని ఆనంద్‌ మహీంద్రా క్యాప్షన్ పెట్టారు.

ఈ పోస్ట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. యువకుడి ప్రతిభను ప్రశంసిస్తూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఉద్యానవనాలు, జూపార్క్‌లు, ఆఫీస్‌ ప్రాంగణాల్లో ఇటువంటి వాహనాలు ఉపయుక్తంగా ఉంటాయని ఒక నెటిజన్‌ పేర్కొన్నారు. సౌర ఫలకాలతో పైకప్పు ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని మరో నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. ‘గ్రామీణ ఆవిష్కరణలను హైలైట్ చేస్తున్నందుకు మీకు హ్యాట్సాఫ్’ అని మరొకరు ఆనంద్‌ మహీంద్రాను కొనియాడారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు