Published : 29 Jun 2022 23:55 IST

Viral Video: గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చీమలు కూడా దొంగతనం చేస్తాయంటే ఎవరైనా  నమ్ముతారా? ఆ.. ఏముందీ చీమలకు పంచదార అంటే ఇష్టం కదా వాటినే దొంగలించినట్టున్నాయి అని తేలికగా తీసిపారేయకండి. చీమలు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాయి. ఏంటీ.. చీమలు స్మగ్లింగ్‌ చేయడమేంటి విడ్డూరం కాకపోతేనూ.. ఇదంతా వట్టి మాటలే అని కొట్టిపారేయకండి. నిజమే.. మనుషులే కాదు.. చీమలు కూడా దొంగతనానికి పాల్పడ్డాయి. ఏకంగా ఓ బంగారు గొలుసునే ఎత్తుకెళ్లాయి. ఇలా ఎత్తుకెళ్తూ కెమెరా కంటికి చిక్కాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సుసాంత నంద అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో చీమల దండు ఒక బంగారు గొలుసును లాక్కెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని షేర్ చేస్తూ ‘‘బుల్లి గోల్డ్‌ స్మగర్లు.. ఐపీసీలోని ఏ సెక్షన్‌ కింద ఈ చీమలపై కేసు నమోదు చేయాలి?’’ అని రాసుకొచ్చారు. దీనికి నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ‘వాటికి కొంత చక్కెరను ఆఫర్‌ చేసి తిరిగి గొలుసును పొందొచ్చు’ అని ఒకరు కామెంట్‌  చేయగా.. ‘బలమైన బంధం అనే సెక్షన్‌ కింద ఆహారం పొందాలంటే కష్టపడాలి. ఇది మనకు నేర్పిన చీమలకు సెల్యూట్‌. దీన్ని మనం ప్రశంసించాలి’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘ఈ గొలుసును చీమల రాణి కోసం మోసుకెళ్తున్నాయి’ అని ఒకరు ఫన్నీగా స్పందించారు. రెండు సెకన్లు ఉన్న ఈ వీడియోను సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి ఇప్పటికే 4వేలకు పైగా లైక్స్‌ కూడా వచ్చాయి. అయితే, ఇది ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అసలు ఇది నిజమైన బంగారమేనా? లేక నకిలీదా? చీమలు ఇలా ఎందుకు తీసుకెళ్తున్నాయి అనే దానిపైనా స్పష్టత లేదు.



Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని