Marriage in air: 70అడుగుల ఎత్తులో పెళ్లి వేడుక.. వీడియో చూశారా?

భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీవితంలో ఒకేసారి జరిగే తమ పెళ్లివేడుకలో మధుర క్షణాలు కలకాలం గుర్తుండిపోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.

Published : 27 Nov 2022 18:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీవితంలో ఒకేసారి జరిగే తమ పెళ్లివేడుకలో మధుర క్షణాలు కలకాలం గుర్తుండిపోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. పెళ్లిసందడి మొదలైందంటే చాలు ప్రీవెడ్డింగ్‌ షూట్‌, మండపం ఏర్పాటు మొదలుకొని భోజనాల వరకు ప్రతిదీ ఎంతో విభిన్నంగా చేయాలని ఆరాటపడుతుంటారు చాలామంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఓ జంట గాలిలో పెళ్లివేడుక జరుపుకొని వార్తల్లో నిలిచింది. 70అడుగుల ఎత్తులో ఎయిర్‌ బెలూన్‌లో వధూవరులు పూలదండలు మార్చుకొని ఒక్కటయ్యారు. దుర్గ్‌ జిల్లా భిలాయిలోని సెక్టార్‌ 7లో జరిగిన ఈ వినూత్న వెడ్డింగ్‌ వీడియో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా వధువు తండ్రి మాట్లాడుతూ.. తన కుమార్తె పెళ్లివేడుకను విభిన్నంగా చేయాలనుకున్నట్టు చెప్పారు. అందుకే రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా ఎయిర్‌ బెలూన్‌ తెప్పించినట్టు తెలిపారు. దీన్ని ప్రత్యేకంగా అలంకరించి వధూవరులు దండలు మార్చుకొనేలా ఏర్పాటు చేశారు. ఈ బెలూన్‌ చాలా పెద్దగా ఉండటంతో వేడుకను సెక్టాకర్‌ 7 దసరా మైదాన్‌లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ బెలూన్‌లో వేడి గాలిని నింపి, 7 మంది బృందం తాడు సహాయంతో దాన్ని పైకి, కిందకు లాగుతుండగా.. వధూవరులు ప్రీతి, రవి 70 అడుగుల ఎత్తులో బంధుమిత్రుల కేరింతల మధ్య పూలదండలు మార్చుకొని ఒక్కటయ్యారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని