Viral video: ట్రాక్టర్ నడుపుకొంటూ పెళ్లి మండపానికి వచ్చిన వధువు.. కారణమిదే..!

ఓ వధువు ట్రాక్టర్‌ నడుపుతూ పెళ్లి మండపానికి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.......

Published : 28 May 2022 02:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ వధువు ట్రాక్టర్‌ నడుపుతూ పెళ్లి మండపానికి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఆసక్తికర ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెతుల్‌ జిల్లా జావ్రా గ్రామానికి చెందిన భారతి తద్గే అనే యువతికి సమీప గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం సాయంత్రం ఈ వివాహం జరగ్గా.. మండపానికి వధువు ఆసక్తికర రీతిలో వచ్చింది. తన సోదరులిద్దరు ఇరువైపులా కూర్చొని ఉండగా.. వధువు భారతి ట్రాక్టర్‌ నడుపుకొంటూ వివాహ వేదిక వద్దకు చేరుకొంది. నళ్ల కళ్లజోడు ధరించి ట్రెండీగా కనిపించింది. వధువు ట్రాక్టర్‌పై ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వధువు పల్లకిలోనో, ట్రాక్టర్‌లోనో రావడం రొటీన్‌గా మారిందని.. కొత్తగా కనిపించేందుకు తాను ఈ ప్రయత్నం చేసినట్లు భారతి చెప్పుకొచ్చింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని