Updated : 01 Aug 2022 11:32 IST

Viral video: వివాహ భోజనం రుచిచూసి మైమరిచిపోయిన పెళ్లి కూతురు.. వీడియో చూశారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ మధుర ఘట్టం. అయితే ఆరోజు మాత్రం వధూవరులు ఉపవాసం ఉండక తప్పదు. వివాహ కార్యక్రమాలు, అతిథులను కలవడం, ఫొటోలు దిగడం ఇలా వారు భోజనం చేసేందుకు సమయం దొరకదు. అన్ని కార్యక్రమాలు ముగిశాక చివర్లో విందుకు హాజరవుతారు. అయితే ఓ వధువు.. మైమరిచిపోయి వివాహ భోజనాన్ని ఆస్వాదించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

భర్త పక్కన విందులో కూర్చున్న వధువు.. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ నృత్యం చేసింది. అయితే కెమెరా తనను బంధిస్తోందని గుర్తించిన ఆమె సిగ్గుపడుతూనే చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు హాయ్‌ చెప్పింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను రెడిట్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం అది వైరలవుతోంది. ఇప్పటికే దాదాపు 60వేల మంది లైక్‌ చేశారు. ‘ఇది హ్యాపీ ఫుడ్‌ డ్యాన్స్‌’ అని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘పెళ్లి కుమార్తె రుచికరమైన వివాహ భోజనాన్ని ఆస్వాదిస్తోంది’ అని, ‘ఆమె నృత్యం చేసిన విధానం ఎంతో ఆకట్టుకుంది’ అని మరికొందరు పేర్కొంటున్నారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని