Viral Video: అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్‌

మహారాష్ట్రలోని ఓ మలుపు వద్ద కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. పుణే-ముంబయి జాతీయరహదారిపై.. వేగంగా వెళ్తున్న కారు

Updated : 07 Apr 2022 00:00 IST

ముంబయి: మహారాష్ట్రలోని ఓ మలుపు వద్ద కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. పుణే-ముంబయి జాతీయరహదారిపై.. వేగంగా వెళ్తున్న కారు ఖండాలా వద్ద అదుపుతప్పింది. మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. దేవాలయానికి వెళ్లి ముంబయికి తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. కారు బోల్తాపడిన ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు పేర్కొన్నారు. కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో నిక్షిప్తమయ్యాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని