డీగో.. నీ టాలెంట్ సూపర్‌.. వీడియో వైరల్‌

చూసేందుకు ఆయనేమీ ఆజానుబావుడు కాదు. భారీగా శారీరక ధారుడ్యం కలిగినవాడూ కాదు. అయితేనేమీ ప్రపంచమంతా..

Updated : 06 Dec 2022 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చూసేందుకు ఆయనేమీ ఆజానుబావుడు కాదు. భారీగా శారీరక ధారుడ్యం కలిగినవాడూ కాదు. అయితేనేమీ ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు తన ఫుట్‌బాల్‌ ఆటతో. ఆయనే అర్జెంటీనాకు చెందిన డీగో అర్మాండో మారడోనా..  ప్రతి ఫుట్‌బాల్‌ అభిమానికి డీగో పేరు తెలియకుండా ఉండదు. అప్పట్లో మారడోనా మైదానంలోకి దిగాడంటే ఒకటే అరుపులు. ప్రత్యర్థులకు అందకుండా గోల్‌ కొట్టడంలో ఎంతో నైపుణ్యం కలిగిన దిగ్గజ ఆటగాడు. నాలుగు రోజుల కిందట(అక్టోబర్‌ 30న) డీగో మారడోనా ఆరు పదుల వయసులోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా 1989వ సంవత్సరంలో మారడోనా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. బంతిని ఎంతో నేర్పుగా ఒడిసి పడుతున్న వైనం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను మీరూ ఓసారి చూసి ఆనందించండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని