Viral video: డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌పై ఎద్దు దాడి.. వైరల్‌ వీడియో

ఓ ఎద్దు ఉన్నట్టుండి వీరంగం సృష్టించింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసును కొమ్ములతో పైకిలేపి కిందపడేసింది.......

Published : 03 Apr 2022 18:26 IST

దిల్లీ: ఓ ఎద్దు ఉన్నట్టుండి వీరంగం సృష్టించింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసును కొమ్ములతో పైకిలేపి కిందపడేసింది. ఈ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ ఘటన రాజధాని దిల్లీలోని దయాల్‌పుర్‌ ప్రాంతం వద్ద చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ జ్ఞాన్‌సింగ్‌ శేర్‌పుర్‌ కూడలి వద్ద విధులు నిర్వహిస్తుండగా.. అక్కడ ఉన్న ద్విచక్రవాహనాల వద్ద తచ్చుడుతూ ఉన్న ఓ ఎద్ద ఒక్కసారిగా జ్ఞాన్‌సింగ్‌పై దాడికి పాల్పడింది. వెనుకనుంచి వచ్చి కానిస్టేబుల్‌ను కొమ్ములతో గాల్లోకిలేపి కిందపడేసింది. దీంతో ఆయనకు తలకు గాయమైంది. అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్‌, స్థానికులు జ్ఞాన్‌సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను వీక్షించండి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని