Viral Video: గున్న ఏనుగు, మావటి సరదా ఆట.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు!
మావాటితో ఓ గున్న ఏనుగు చేసిన హంగామా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారి సరదా ఆట చూసిన నెటిజన్లు సంబురపడిపోతున్నారు.......
ఇంటర్నెట్ డెస్క్: మానవులతోనూ జంతువులు స్నేహభావంతో మెలుగుతూ ప్రేమను పంచుతాయి. వారితో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాయి. అలాంటి ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. మావటితో ఓ గున్న ఏనుగు చేసిన హంగామా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారి సరదా ఆట చూసిన నెటిజన్లు సంబురపడిపోతున్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సమ్రత్ గౌడ ట్విటర్లో ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో.. కంచెకు ఉన్న ఇనుప రాడ్డును చాకచక్యంగా తొలగించిన ఓ గున్న ఏనుగు, బయటకు వచ్చి నేరుగా పరుపుపై పడుకున్న మావటి వద్దకు వెళ్లింది. అది తన బెడ్ అని చెప్పకనే చెబుతూ.. ఆ పరుపు పైనుంచి మావటిని లేపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎంతకూ లేవకపోయేసరికి అతడిని పక్కకు నెట్టి ఆ బెడ్‌ను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది. మావటి మళ్లీ వచ్చి పడుకోవడంతో నొచ్చుకున్న గున్న ఏనుగు కాస్త అలక ప్రదర్శించడం ముచ్చటగొలుపుతోంది. చివరకు మావటి, ఏనుగు ఇద్దరూ ఆ పరుపులో పడుకుండిపోతారు.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేశారు. కానీ ఎక్కడ జరిగిందో స్పష్టతలేదు. దీనిని ఇప్పటికే 181వేల మంది వీక్షించగా, అనేక మంది వావ్ అంటున్నారు. వారిద్దరి మధ్య ఉన్నది ఎంతో గొప్ప అనుబంధం అని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు తాము చూసి ఆహ్లాదకరమైన వీడియో అని మరికొందరు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్‌లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట