Viral Video: 30ఏళ్లలో ‘టేబుల్‌’ ఎంతలా మారిపోయిందో.. ఒక్క వీడియోలో..!

కాలం మారుతోంది. అంతర్జాలం కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా అంతా డిజిటల్‌ రూపాన్ని........

Published : 31 Aug 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలం మారుతోంది. అంతర్జాలం కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా అంతా డిజిటల్‌ రూపాన్ని సంతరించుకుంటోంది.  టైం చూసుకునుందుకు వాచీ పెట్టుకోవాల్సిన పనిలేదు.. చేతిలో మొబైల్‌ ఉంటే చాలు. గోడకు క్యాలెండర్‌, టేబుల్‌ మీద కాలిక్యులేటర్‌, ర్యాక్‌లో పుస్తకాలు ఉండాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు ఇవన్నీ డిజిటల్‌ రూపంలోనే ఉంటున్నాయి. కాగా ఇదే విషయాన్ని ‘ఏ స్లైస్‌ ఆఫ్‌ హిస్టరీ’ అనే ట్విటర్‌ ఖాతాలో అద్భుతంగా చూపించారు. 36 సెకన్ల వీడియోను ట్వీట్‌ చేస్తూ.. ఓ టేబుల్‌పై ఉన్న వస్తువులు 30ఏళ్లుగా ఎలా డిజిటల్‌ రూపంలోకి మారుతూ వచ్చాయో కళ్లకుకట్టారు. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 55వేల మందికిపైగా వీక్షించారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని