Viral Video: కదిలించే.. చిన్నారి దేశభక్తి..!

ఆ చిన్నారి దేశభక్తి నెటిజన్లను కదిలించింది. కొందరు ఆర్మీ ఆఫీసర్లు నిల్చొని ఉండగా.. ఓ చిన్నారి పరిగెత్తుకుంటూ వారివైపు వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆర్మీ ఆఫీసర్‌ కాళ్లకు నమస్కరించింది. దీంతో అక్కడున్న మిగతా ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు.

Updated : 19 Jul 2022 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆ చిన్నారి దేశభక్తి నెటిజన్లను కదిలించింది. కొందరు ఆర్మీ ఆఫీసర్లు నిల్చొని ఉండగా.. ఓ చిన్నారి పరిగెత్తుకుంటూ వారివైపు వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆర్మీ ఆఫీసర్‌ కాళ్లకు నమస్కరించింది. దీంతో అక్కడున్న మిగతా ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. ఎక్కడో కచ్చితంగా తెలియదుగానీ.. ఏదో మెట్రో స్టేషన్‌లో ఈ సంఘటన జరిగినట్లు కనిపిస్తోంది. బెంగళూరు ఎంపీ పీసీ మోహన్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘పిల్లల్లో దేశభక్తిని పెంపొందింపచేయడం తల్లిదండ్రుల కర్తవ్యం..జైహింద్‌’ అంటూ రాసుకొచ్చారు. ఇప్పటివరకు 10 లక్షల వ్యూస్‌ సొంతం చేసుకున్న ఈ వీడియో.. ప్రస్తుతం  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని