Viral video: సైకిల్‌ తొక్కి కిందపడిన గొరిల్లా.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!

ఓ గొరిల్లా సైకిల్‌ తొక్కడం మీరెప్పుడైనా చూశారా..? గొరిల్లా ఏంటి, సైకిల్‌ తొక్కడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.......

Published : 11 Jun 2022 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ గొరిల్లా సైకిల్‌ తొక్కడం మీరెప్పుడైనా చూశారా..? గొరిల్లా ఏంటి, సైకిల్‌ తొక్కడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..! ఔనండీ బాబూ.. ఓ గొరిల్లా అచ్చూ మనిషిలానే సైకిల్‌ తొక్కింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్‌ అధికారి (IFS) సమ్రత్‌ గౌడా ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. అందులో ఓ గొరిల్లా చిన్నపాటి సైకిల్‌ తొక్కుతూ కనిపించింది. సైకిల్‌పై కొద్దిదూరం వెళ్లగానే కిందపడిన ఆ జంతువు.. కోపంతో ఆ సైకిల్‌ను విసిరేయడం నవ్వులు పూయిస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. సైకిల్‌ను గొరిల్లా విసిరేయడాన్ని చూసి ‘స్టుపిడ్‌ సైకిల్‌! ఎంత ధైర్యం నీకు.. నన్నే కిందపడేస్తావా’ అని గొరిల్లా భావిస్తోందేమోనని ఓ నెటిజన్‌ సరదాగా రాసుకొచ్చాడు. ‘ఆ గొరిల్లాకు మరో మంచి సైకిల్‌ అందించండి, అప్పుడైనా అది సంతృప్తి చెందుతుందేమో’ అని మరో వ్యక్తి పేర్కొన్నాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని