Viral video: బెడిసికొట్టిన బైక్‌ స్టంట్‌.. పంచ్‌లైన్‌తో పోలీసుల వెరైటీ పోస్ట్‌!

అతివేగం, బైక్‌ స్టంట్‌లు ప్రమాదకరమని సీరియస్‌గా చెబుతూనే.. దానికి కాస్త హాస్యాన్ని జోడించి దిల్లీ పోలీసులు వెరైటీగా ప్రచారం చేస్తున్నారు.........

Published : 03 Aug 2022 20:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ యువకుడు ప్రమాదకర రీతిలో బైక్‌ స్టంట్‌లకు పాల్పడుతూ.. అదుపుతప్పి  కిందపడిన వీడియోను దిల్లీ పోలీసులు ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. అతివేగం, బైక్‌ స్టంట్‌లు ప్రమాదకరమని సీరియస్‌గా చెబుతూనే.. దానికి కాస్త హాస్యాన్ని జోడించి వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. రహదారిపై స్టంట్‌లు చేస్తూ రయ్‌మంటూ దూసుకుపోయిన ఓ యువకుడు అదుపుతప్పి కిందపడిపోయాడు. హెల్మెట్‌ ఉండటంతో అదృష్టవశాత్తూ అతడికి ప్రాణాపాయం తప్పింది. ఆ స్పీడ్‌కు బైక్‌ ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు పంచుకుంటూ.. రోడ్లపై మీ ఇష్టమొచ్చినట్లు వెళ్తామంటే సాగదని, ఇలాంటి స్టంట్‌లు చేస్తే మూల్యం తప్పదనే రీతిలో పంచ్‌లైన్‌తో హిందీలో ట్వీట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారుతోంది. నిబంధనలు ఉల్లంఘించడంపై దిల్లీ పోలీసులు విభిన్న రీతిలో ప్రచారం చేయడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని