Bengaluru: అమానుషం.. నడిరోడ్డుపై బైక్‌తో వృద్ధుడిని ఈడ్చుకెళ్లి!
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ద్విచక్ర వాహనంతో ఓ వృద్ధుడి కారును ఢీకొట్టడమే కాకుండా.. అక్కడినుంచి తప్పించుకునే యత్నంలో ఆయన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడో యువకుడు. ఇటీవల దిల్లీలో ఓ యువతిని కారుతో ఢీకొట్టి, కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన చర్చనీయాంశమైన వేళ తాజా వ్యవహారం వెలుగు చూసింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. సాహిల్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంతో ముత్తప్ప(71) కారును ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే ఆయన తన కారులో నుంచి దిగగానే.. అతను పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ముత్తప్ప.. వెంటనే అతని బైక్ వెనుక భాగాన్ని పట్టుకున్నారు. అయినప్పటికీ.. అతను మాత్రం వేగంగా బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. వెనుకవైపు ఆయన అలాగే వేలాడుతున్నా.. బండిని ఆపకుండా రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. తోటి వాహనదారులు గమనించి వెంటనే అతన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో వృద్ధుడి కాళ్లకు గాయాలయ్యాయి. నిందితుడిని అరెస్టు చేశామని, ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!
-
Ap-top-news News
AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్’ చూడొద్దు: హైకోర్టు
-
General News
Tirumala: వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం