Viral Video: కోడిపై ఆశతో.. చిరుత బోనులో చిక్కాడు!
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ గ్రామంలో చిరుత(Leopard)ను బంధించేందుకు ఏర్పాటు చేసిన బోనులో ఓ మనిషి చిక్కుకుపోవడం గమనార్హం. బులంద్‌షెహర్(Bulandshahr) జిల్లాలోని బసెందువా గ్రామంలో కొన్నాళ్లుగా ఓ చిరుత పులి సంచరిస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. దానిని పట్టుకునేందుకు గ్రామ శివారులో ఓ బోను(Cage) ఏర్పాటు చేశారు. అందులో చిరుతకు ఎరగా ఓ కోడిపుంజును ఉంచారు.
అయితే, ఎవరు లేకుండా చూసి.. ఆ కోడిపుంజును కాజేయాలన్న ఆశతో ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అంతే.. ఒక్కసారిగా బోను గేటు మూసుకుపోవడంతో లోపలే చిక్కుకుపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు.. అతన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘అయ్యో..!’ అని కొందరు నెటిజన్లు స్పందించగా.. కోడిపుంజును చేజిక్కించుకునే క్రమంలో తానే చిక్కుకుపోయాడంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Iran: ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు
-
Politics News
Rahul Gandhi:యువతకు 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ₹3వేలు నిరుద్యోగ భృతి: రాహుల్ హామీ
-
Sports News
IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు.. భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష
-
India News
Khalistan: ఆగని ఖలిస్థానీ అనుకూలవాదుల దాడులు.. నిన్న లండన్.. నేడు శాన్ఫ్రాన్సిస్కో
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు
-
India News
Flight Pilots: విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం ఎందుకు తీసుకోరు?