Viral Video: ఇద్దరు వైద్యుల డ్యాన్స్‌.. ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌

కేరళకు చెందిన ఇద్దరు వైద్యులు చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మధ్యే విడుదలైన పృథ్విరాజ్‌ సుకుమారన్‌ నటించిన ‘కడువ’.......

Published : 15 Aug 2022 16:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళకు చెందిన ఇద్దరు వైద్యులు చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మధ్యే విడుదలైన పృథ్విరాజ్‌ సుకుమారన్‌ నటించిన ‘కడువ’ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘పాలా పల్లి తిరుపల్లి’కి వారిద్దరు కలిసి స్టెప్పులేశారు. వయనాడ్‌లోని ట్రైబల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సవన్‌ సరా మ్యాథ్యూ, మెడికల్ ఆఫీసర్‌ డా.సఫిజ్‌ అలీ ఇద్దరు కలిసి ఆ పాటకు స్టెప్పులేయడం విశేషం.

ఆ వీడియోను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఫేస్‌బుక్‌లో పంచుకొని ఆ వైద్యులను ప్రశంసించారు. డా.సరా మ్యాథ్యూ, డా.సఫిజ్‌ అలీ ఇద్దరూ అత్యుత్తమ వైద్యులని.. అలాగే మంచి డ్యాన్సర్లంటూ కొనియాడారు. ఆ ఆసుపత్రి సిబ్బంది  వేలాది మంది రోగులకు ఉత్తమ సేవలందిస్తున్నారని ప్రశంసించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని