Viral Video: నీటి మడుగులో పాము, ముంగిస మధ్య భీకర పోరు.. వీడియో చూశారా!

ఓ నీటి మడుగులో నల్లతాచు, ముంగిస మధ్య భీకర పోరు జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 16 Oct 2022 00:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పాము, ముంగిస.. తారసపడ్డాయంటే..ఇక భీకర పోరే. అవి పొట్లాడుకున్న దృశ్యాలు మనం గతంలో చూసే ఉంటాం. అయితే, ఓ నీటి మడుగులో తాచుపాము, ముంగిస భీకరంగా దాడి చేసుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్‌ అయ్యింది. నీటి మడుగు ఉన్న ఓ ప్రదేశంలోకి వచ్చిన నల్లతాచుపై ముంగిస దాడికి పాల్పడింది. పాము సైతం బుసలు కొడుతూ దీటుటా ప్రతిదాడి చేసింది. కాగా ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 2లక్షల మందికిపైగా వీక్షించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని