Viral news: కొత్తకారుతో ఇంటికొస్తే ఏం జరిగిందో చూడండి!

సొంత కారు కొనుక్కోవాలని చాలా మంది కోరిక. కొత్త కారుతో ఇంటికి వస్తుంటే ఆ  ఆనందమే వేరు. అలా వస్తున్నప్పుడే ఊహించని ఘటన ఎదురైతే..! ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది.

Published : 10 Oct 2022 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సొంత కారు కొనుక్కోవాలని చాలా మంది కోరిక. కొత్త కారుతో ఇంటికి వస్తుంటే ఆ  ఆనందమే వేరు. అలా వస్తున్నప్పుడే ఊహించని ఘటన ఎదురైతే..! ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది. కొత్తకారుతో గేటు నుంచి లోపలికి వస్తుండగా..అక్కడ పార్కుచేసి ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్లిందా కారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోయినా.. బైకులు మాత్రం దెబ్బతిన్నాయి. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. వినోద్‌ కుమార్‌ అనే ఓ మాజీ వైమానిక అధికారి ట్విటర్‌లో ఈ వీడియోను పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని