Viral video: ఈ వీడియో చూస్తే కదిలే రైలెక్కే ప్రయత్నం చేయరు!

కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన ఓ యువకుడిని రైల్వే కానిస్టేబుల్‌ సకాలంలో కాపాడాడు. దీంతో ఆ యువకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Published : 13 Mar 2022 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన ఓ యువకుడిని రైల్వే కానిస్టేబుల్‌ సకాలంలో కాపాడాడు. దీంతో ఆ యువకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ముంబయిలోని వడాలా రైల్వేస్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన 14 సెకన్ల వీడియోను సెంట్రల్‌ రైల్వే ట్విటర్లో పోస్ట్‌ చేసింది.

వాదాలా రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు కదులుతున్న రైలును ఎక్కబోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టుతప్పి పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ నేత్రపాల్‌ సింగ్‌ సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఏమాత్రం ఆలస్యం జరిగినా రైలు, ప్లాట్‌ఫామ్‌ మధ్య నలిగిపోయేవాడే. రైలు కదులుతున్నప్పుడు ఎక్కడం గానీ, దిగడం గానీ చేయొద్దని రైల్వే శాఖ సూచించింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని