Dead Fish: ఎక్కడ చూసినా చచ్చిన చేపలే.. లక్షలాది మృత్యువాత!

ఆస్ట్రేలియాలోని డార్లింగ్‌ నదిలో లక్షలాది చేపలు మృత్యువాత పడ్డాయి. వరద నీరు తగ్గుముఖం పట్టడంతోపాటు నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.

Published : 18 Mar 2023 23:10 IST

కాన్‌బెర్రా: వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. కిలోమీటర్ల మేర నదిలో ఎక్కడ చూసినా నిర్జీవంగా తేలియాడుతోన్న చేపల దృశ్యాలే. ఆస్ట్రేలియా (Australia) న్యూ సౌత్‌వేల్స్‌లోని మారుమూల పట్టణం మెనిండీ (Menindee) సమీపంలో డార్లింగ్‌ నది (Darling River)లో ఈ పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

నదిలో వరద నీరు తగ్గుముఖం పట్టడంతోపాటు... వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్‌ శాతం పడిపోవడమే చేపల మృత్యువాతకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి వరదల తరువాత నదిలో చేపల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో భారీ సంఖ్యలో చనిపోతున్నాయని అధికారులు తెలిపారు. ‘‘ప్రస్తుతం వాతావరణం చాలా వేడిగా ఉంది. చల్లని నీళ్లతో పోలిస్తే వేడి జలాల్లో తక్కువ ఆక్సిజన్‌ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద చేపలకు ఆక్సిజన్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆక్సిజన్‌ అందక చేపలు చనిపోయాయి’’ అని అధికారులు వివరించారు. ఈ ప్రాంతంలో గతంలోనూ ఇలాగే చేపలు మృత్యువాతపడ్డాయని తెలిపారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని