Viral Video: రోజూ అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని వానరం కంటతడి.. వీడియో

తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఓ వానరం(Monkey) రోదించి అతడికి ముద్దు పెట్టి నివాళులర్పించిన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేశాయి.  

Published : 20 Oct 2022 16:51 IST

కొలంబో: అన్నం పెట్టినవారినే కడతేరుస్తున్న విశ్వాస ఘాతకులను మనం చూస్తున్నాం. మానవత్వానికే మాయని మచ్చగా మారుతోన్న అనేక సంఘటనలు జరుగుతున్న ఈరోజుల్లో తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఓ వానరం(Monkey) రోధించి అతడికి ముద్దు పెట్టి నివాళులర్పించిన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేశాయి.  శ్రీలంక(Srilanka)లోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. బట్టికలోవ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి వానరంతో స్నేహంగా ఉండేవాడు. రోజూ ఇంటికి వచ్చిన కోతికి అతడు ఆహారం పెట్టేవాడు.. దీంతో ఆ మూగజీవం అతడితో సరదాగా ఆడుకొనేది. దురదృష్టవశాత్తు, ఈ నెల 18న అతడు మరణించాడు. అయితే, రోజూలాగే ఆ మరుసటి ఉదయం ఇంటికి వచ్చిన వానరానికి ప్రేమతో అన్నం పెట్టే తన మిత్రుడు కనబడలేదు. అప్పటికే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు మృతదేహం చుట్టూ గుమిగూడి ఉన్నారు. దీంతో మృతదేహం వద్దకు వెళ్లిన వానరం అతడు ఇక తిరిగిరాడని తెలియక ఆడుకొనేందుకు పిలిచేందుకు తట్టిలేపే ప్రయత్నం చేయడం అందరినీ కలిచివేసింది. ఎంతకూ లేవకపోయే సరికి కంటతడి పెడుతూ అతడికి ముద్దు పెడుతూ నివాళులర్పించిన దృశ్యాలు అక్కడి ఉన్నవారి హృదయాలను బరువెక్కించాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని