Viral Video: మండపంలోనే కునుకుతీసిన వధువు.. వైరల్‌గా మారిన వీడియో

వివాహ తంతు కొనసాగుతుండగా.. ఓ వధువు పెళ్లి మండపంలోనే కునుకుతీసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను దాదాపు 8లక్షల మంది వీక్షించారు.

Published : 10 Oct 2022 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఘట్టం. వివాహ తంతులోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని వధూవరులు కోరుకుంటారు. అయితే, సంప్రదాయబద్ధంగా సాగే వివాహ వేడుకలో తీరికలేని కార్యక్రమాల వల్ల వారు అలిసిపోవడం సహజమే. అలా అలసటకు గురైందో ఏమో ఓ వధువు ఏకంగా పెళ్లి మండపంలోనే నిద్రపోయింది. పెళ్లి దుస్తులు, నిండుగా నగలు ధరించిన ఆమె కుర్చీలో కూర్చొని కునుకుతీసింది. ఈ ఘటన గతంలోనే జరిగినప్పటికీ.. ఇందుకు సంబంధించిన వీడియో వధువు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అది వైరల్‌గా మారింది. ‘నిద్రపోతున్న వధువు (నేను). అప్పటికే ఉదయం 6.30 అవుతున్నా వివాహ వేడుక కొనసాగుతోంది’ అంటూ రాసుకొచ్చింది.

కాగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే దాదాపు 8లక్షల మంది వీక్షించారు. అనేకమంది కామెంట్లు చేస్తూ తమ వివాహ వేడుకను గుర్తు చేసుకుంటున్నారు. ‘నాకు నా పెళ్లి వేడుక గుర్తొచ్చింది’ అంటూ పేర్కొంటున్నారు. ‘వివాహ కార్యక్రమాల్లో మునిగిపోయి నిద్రకు దూరమవడంతో ఇలా జరగడం సహజమే’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని