Viral Video: ఈ మహిళల ఫీట్ అదుర్స్.. తలతోనే ఉట్టిని పగులగొట్టిన బామ్మ
ఇంటర్నెట్ డెస్క్: కరోనాతో రెండేళ్లపాటు కృష్ణాష్ఠమి వేడుకలకు దూరమైన ప్రజలు.. ఈసారి ఘనంగా జరుపుకొన్నారు. కరోనా నిబంధనలు లేకపోవడంతో చిన్నాపెద్దా అంతా కలిసి ఈ వేడుకలను ఆస్వాదించారు. కాగా, ఈ వేడుకలకు సంబంధించి ఐఏఎస్ అధికారి దీపాన్షు కబ్రా షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. కృష్ణాష్ఠమిలో భాగంగా ఆసక్తకరంగా జరుపుకునే ‘దహీ హండి’ (ఉట్టి కొట్టే) వేడుకల్లో సాధారణంగా యువకులదే హవా సాగుతుంది. కానీ ఈ వీడియోలో మహిళలే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాదు ఆ మహిళలే పిరమిడ్‌గా ఏర్పడగా, వారిపై ఎక్కి ఓ వృద్ధురాలు ఆ ఉట్టిని కొట్టింది. ఆమె తన తలతో ఉట్టిని పగులగొట్టడం విశేషం. అదీ మొదటి ప్రయత్నంలోనే.
వీడియోలో ఆ వృద్ధురాలి చురుకుదనం చూసిన నెటిజన్లు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. పట్టుకోల్పోతున్నా.. అదుపుతప్పకుండా తనను తాను నియంత్రించుకున్న విధానం, ఉట్టి కొట్టిన తీరుకు నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ‘సూపర్ ఉమెన్’, ‘అద్భుత బామ్మ’ అంటూ కొనియాడుతున్నారు. వయసు ఒక సంఖ్య మాత్రమేనని, అనుకున్నది సాధించాలనే సంకల్పం ఉంటే వయసు ఆపలేదంటూ ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఐఏఎస్ అధికారి పంచుకున్న ఈ వీడియోను మీరూ వీక్షించండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్