Viral video: లైవ్‌లోనే బాలుడి చెంప ఛెళ్లుమనిపించిన మహిళా జర్నలిస్టు

లైవ్‌లో రిపోర్టింగ్‌ చేస్తున్న మహిళా జర్నలిస్ట్‌ ఓ బాలుడి చెంప చెళ్లుమనిపించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బాలుడు అనుచితంగా......

Published : 13 Jul 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైవ్‌లో రిపోర్టింగ్‌ చేస్తున్న మహిళా జర్నలిస్ట్‌ ఓ బాలుడి చెంప చెళ్లుమనిపించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బాలుడు అనుచితంగా వ్యవహరించడం కారణంగానే సహనం కోల్పోయిన జర్నలిస్ట్‌ అతడిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఈద్‌-అల్‌-అదాను పురస్కరించుకొని పాకిస్థాన్‌లో ఈనెల 9వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించారు. అయితే పండగను జరుపుకొనే విధానం, ప్రజల స్పందనను తెలియజేస్తూ.. ఓ మహిళా జర్నలిస్ట్‌ లైవ్‌లో రిపోర్టింగ్‌ చేస్తున్నారు.

చుట్టూ చిన్నపిల్లలు, మహిళలు ఉండగా రిపోర్టింగ్‌ చేస్తున్న ఆ జర్నలిస్ట్‌ ఉన్నట్టుండి ఓ బాలుడి చెంప ఛెళ్లుమనిపించింది. కెమెరాకు సమీపంలో ఉన్న ఆ బాలుడు కెమెరాకు చేయి అడ్డుపెట్టి తన మిత్రుడిని పిలిచాడు. అయితే అతడు పరుష పదజాలం వాడినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె సహనం కోల్పోయి అతడి చెంపపై కొట్టినట్లు కనిపిస్తోంది. కాగా ఇప్పుడు ఆ వీడియో వైరలవుతోంది. ఆ క్లిప్పింగ్‌ను ఇప్పటికే దాదాపు 6లక్షల మంది వీక్షించారు.

జర్నలిస్ట్‌ ప్రవర్తనపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె చర్యను సమర్థించడగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఆ బాలుడిని కొట్టే అధికారం ఆమెకు ఎక్కడిది? అని కొందరు ప్రశ్నిస్తుండగా.. అతడు కచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటాడు.. అందుకే ఆమె కొట్టి ఉంటుంది అని ఇంకొందరు సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని