Viral video: భారత జాతీయ గీతం ‘జనగణమన’ వినిపించిన పాకిస్థానీ మ్యుజీషియన్‌

ఓ పాకిస్థానీ మ్యుజీషియన్‌ సామరస్యాన్ని చాటుకున్నాడు. భారత్‌ 75వ స్వతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న వేళ.. మన జాతీయ గీతమైన ‘జనగణమన’ను........

Published : 15 Aug 2022 20:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ పాకిస్థానీ మ్యుజీషియన్‌ సామరస్యాన్ని చాటుకున్నాడు. భారత్‌ 75వ 'స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న వేళ.. మన జాతీయ గీతమైన ‘జనగణమన’ను ఆయన ‘రబాబ్‌’ ద్వారా వాయించి భారతీయులకు అంకితమిచ్చాడు. పాకిస్థాన్‌కు చెందిన సియాల్‌ ఖాన్‌ రబాబ్‌ వాయిద్యకారుడు. (తంబూర తరహాలో ఉండే రబాబ్‌ పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌తోపాటు కశ్మీర్‌లోనూ ప్రసిద్ధి). భారత జాతీయ గీతమైన ‘జనగణమన’ను రబాబ్‌తో అద్భుతంగా వాయించిన సియాల్‌ ఖాన్.. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు.

‘సరిహద్దుల్లో ఉన్న వీక్షకులకు నా కానుక’ అంటూ ఆ వీడియోను పోస్టు చేశాడు. ‘భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య శాంతి, సహనం, మంచి సంబంధాలు ఏర్పడేందుకు.. స్నేహం, సద్భావనకు చిహ్నంగా నేను భారతదేశ జాతీయ గీతాన్ని ప్రయత్నించాను’ అంటూ సంగీతకారుడు జోడించారు. కాగా రెండు దేశాల ప్రజలు ఈ వీడియోను ఇష్టపడుతుండటంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఒక మిలియన్‌ మంది వీక్షించారు. 56వేల మంది లైక్‌ చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని