Published : 11 Aug 2022 01:43 IST

Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోషక విలువలు మెండుగా ఉండే జీడిపప్పుకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. నేరుగా, వంటల్లో, మసాలాలు కలుపుకొని.. ఇలా వాటిని ఎలాగైనా తినేయొచ్చు. అయితే వాటికి చీమల బెడద ఎక్కువ. అందుకే ఎక్కడ కొన్నా, ఎలా దాచినా ఓసారి పరిశీలించిన తర్వాతే తినాలి సుమా..! లేదంటే ఈ యువకుల్లా ఇబ్బందులు పడాల్సిందే. చీమలు పట్టిన జీడిపప్పును తిని వాంతులు చేసుకుంటున్న ఓ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ వీడియోను ఇప్పటికే 10మిలియన్ల మంది వీక్షించడం విశేషం.

ఓ ప్యాకెట్‌లో ఉన్న జీడిపప్పును పోటాపోటీగా తినడం ప్రారంభించింది ఓ యువకుల బృందం. అయితే ఆ ప్యాకెట్‌ సగం ఖాళీ అయ్యేవరకు కూడా అందులో చీమలున్నాయని గుర్తించకుండా, పప్పుతోపాటు వాటినీ తినేశారు. చివరకు ఆ నట్స్‌లో చీమలున్నట్లు తెలుసుకొని వారు ఒకింత షాక్‌కు గురయ్యారు. ‘లోపల ఏముందో పరీక్షించకుండానే ఈ జీడిపప్పును ఒక నిమిషం పాటు తిన్నాం’ అంటూ చీమలు ఉన్న జీడిపప్పు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందులో ఓ వ్యక్తి వాంతి చేసుకుంటూ కనిపించాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దాన్ని 10మిలియన్ల మందికిపైగా వీక్షించగా.. 354వేల మంది లైక్‌ చేశారు.

వేలాది మంది నెటిజన్లు కామెంట్‌ చేశారు. అందులో అనేక సరదా, ఆశ్చర్యకర కామెంట్లు కూడా ఉన్నాయి. ‘చీమలతో మీకు మంచి ప్రొటీన్‌ అందింది.. అయినా వాటిని ఎలా చూసుకోలేదు’ అని ఓ నెటిజన్‌ పేర్కొనగా, ‘వాటిద్వారా ఓ 50గ్రాముల ప్రొటీన్‌ అంది ఉంటుంది’ అంటూ మరో నెటిజన్‌ సరదాగా కామెంట్‌ చేశాడు. కొన్ని సందర్భాల్లో మేం కూడా ఇలా పొరపాటున చీమలు తిన్నాం అని మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని