Published : 27 Sep 2022 01:51 IST

Viral Video: దొంగలుగా పొరపాటు పడి.. పరుగో పరుగు!

వైరల్‌గా మారిన బ్రెజిల్‌ రెస్టారంట్‌ వీడియో

బ్రెసిలియా: బ్రెజిల్‌లోని రెసిఫ్‌ రాష్ట్రం. రోడ్డు పక్కనే కాలిబాటపై ఉన్న ఓ రెస్టారంట్‌ వినియోగదారులతో కిటకిటలాడుతోంది. అంతలోనే స్థానికంగా ఓ జిమ్‌కు చెందిన బృందం వారి మధ్యలోంచి చిన్నగా పరుగులు పెడుతూ.. ముందుకు సాగింది. అందులో ఒక మహిళ.. ఎవరో ఛేజ్‌ చేస్తున్నట్లు వెనక్కు తిరిగి చూసింది. అయితే, వారిని చూసి అక్కడున్న వారు.. దొంగలుగా పొరపాటు పడ్డారు. అంతే..! భయాందోళలనకు గురై.. ఒక్కసారిగా అక్కడినుంచి పరుగందుకున్నారు. ఈ గందరగోళం కాస్త చిన్నపాటి తొక్కిసలాటకు దారితీయడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

‘ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. అప్పటివరకు నెమ్మదిగా వచ్చిన ఆ బృందం.. మా దగ్గరికి రాగానే పరుగులు పెట్టింది. దీంతో నా స్నేహితురాలిని అప్రమత్తం చేశా. అంతలోనే ఎవరో చోరీ జరిగిందని అరిచారు. దొంగలు దొంగలు అనేసరికి.. మిగతావారూ తమ వస్తువులను అక్కడే టేబుల్స్‌పై వదిలేసి, పారిపోయారు’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే, అపార్థం చేసుకోవడం వల్లే ఇదంతా జరిగిందని రెస్టరంట్‌ యాజమాన్యం తెలిపినట్లు స్థానిక వార్తాసంస్థలు పేర్కొన్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts