Viral video: పెంపుడు శునకానికి చక్రాల కుర్చీ.. యజమానికి ప్రధాని మోదీ ప్రశంస

కాళ్లులేని ఓ శునకం.. తన యజమాని బయటకు వెళ్తుంటే తనని కూడా తీసుకెళ్లాలని మారాం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 19 Mar 2022 11:12 IST

కోయంబత్తూరు: కాళ్లులేని ఓ శునకం.. తన యజమాని బయటకు వెళ్తుంటే తనని కూడా తీసుకెళ్లాలని మారాం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌కి చెందిన కాశీ అనే వ్యక్తి ఓ శునకాన్ని దత్తత తీసుకుని.. దానికి "వీరా" అని పేరు పెట్టుకున్నాడు. ఆ శునకానికి కాళ్లు లేకపోవడంతో బయటకు తీసుకెళ్లలేకపోయాడు. యజమాని బయటకు వెళ్తుంటే తానూ వస్తానంటూ "వీరా" అరుస్తూ.. మారాం చేసేది. దాని పరిస్థితిని అర్థం చేసుకున్న కాశీ.. ఒక వీల్ చెయిర్‌ లాంటి పరికరాన్ని ప్రతేకంగా తయారు చేయించాడు. దానిపై ఎలా నడవాలో శునకానికి శిక్షణ కూడా ఇచ్చాడు. ఇప్పుడు వాళ్లు బయటకు వెళ్లేటప్పడు తమ వెంట ఆ శునకాన్ని కూడా తీసుకెళ్తున్నారు. కాశీ చేసిన పనిని ప్రధాని మోదీ ప్రశంసించారు. కాశీ వాళ్ల కుమారుడు బయటకు వెళ్దామా అని వీరాని అడగ్గా.. అది జవాబు ఇచ్చే దృశ్యాలు నెట్టింట్లో హల్‌చల్  చేస్తున్నాయి.
 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని