Published : 29 Jul 2022 20:28 IST

Jabalpur: వృద్ధుడిపై కానిస్టేబుల్‌ దాష్టీకం..! రైల్వే ప్లాట్‌ఫాంపై నుంచి వేలాడదీసి దాడి

భోపాల్‌: కనీసం వృద్ధుడనే కనికరం చూపకుండా ఓ వ్యక్తిని అమానుషంగా చితకబాదాడో పోలీసు కానిస్టేబుల్‌. అంతటితో ఆగకుండా రైల్వే ప్లాట్‌ఫాం మీదుగా ట్రాక్‌పైకి అతన్ని వేలాడదీసి మరోసారి దాడి చేశాడు. ఘటన జరిగిన సమయంలో రైల్వే స్టేషన్‌లోని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ రైల్వేస్టేషన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మానవత్వం మరచి ప్రవర్తించిన ఆ పోలీసుపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.

పోలీసు కానిస్టేబుల్‌ ఆ వ్యక్తిని తన్నుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా అలాగే ఈడ్చుకుంటూ తీసుకెళ్లి.. ప్లాట్‌ఫాం నుంచి పట్టాలపైకి వేలాడదీసి మళ్లీ దాడి చేశాడు. బాధితుడిని గోపాల్ ప్రసాద్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ‘ఒక వ్యక్తి నన్ను దుర్భాషలాడుతుండటంపై నేను సంబంధిత పోలీసుకు ఫిర్యాదు చేశా. దీంతో ఆయన.. నాపై దాడికి దిగారు’ అని బాధితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు. మరోవైపు.. దాడి చేసిన కానిస్టేబుల్‌ను అనంత్‌శర్మగా గుర్తించామని, అతన్ని సస్పెండ్ చేశామని రేవా ఎస్పీ వెల్లడించారు.



Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని