Viral Video: జిమ్‌లో వధువు కసరత్తులు‌.. భర్త, అత్తింటివారికి ఇదో హెచ్చరిక!

కాలంతోపాటు ట్రెండ్‌ మారుతోంది. ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెడుతున్న జంటలకు ‘ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌’ అనివార్యమైంది.........

Published : 30 Aug 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలంతోపాటు ట్రెండ్‌ మారుతోంది. ఒకప్పుడు పెళ్లి, రిసెప్షన్‌కు మాత్రమే వధూవరుల ఫొటోషూట్‌ పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెడుతున్న జంటలకు ‘ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌’ అనివార్యమైంది. అనేక ప్రాంతాల్లో, పలు విధాలుగా ఈ ఫొటోషూట్‌ జరుగుతోంది. ప్రకృతి ఒడిలో, ఎంచుకున్న కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోనే కాదు.. కొందరు విచిత్రంగా బురదలోనూ ఫొటోషూట్‌ చేసిన ఘటనలను మనం చూశాం.

అయితే, తమిళనాడుకు చెందిన ఓ యువతి మాత్రం  వినూత్న రీతిలో.. వ్యాయామశాలలో బరువులెత్తుతూ ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లో పాల్గొనడం విశేషం. పెళ్లి కుమార్తెగా ముస్తాబైన ఆ యువతి.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సంయుక్త అనే ట్విటర్‌ యూజర్‌ సదరు వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘భర్త, అత్తింటివారికి ఇదో స్పష్టమైన హెచ్చరిక?’ అంటూ సరదా వ్యాఖ్యలు జోడించారు. కాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘అత్తింటివారి పనైపోయింది’, ‘ఇకపై వారు చుక్కలు చూస్తారు’ అంటూ నెటిజన్లు సైతం అంతే సరదాగా కామెంట్లు చేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని