Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
ఇంటర్నెట్ డెస్క్: ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ (Ranbir Kapoor) ఆ మొబైల్‌ను విసేరేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం జరిగిందో తెలియకపోవడంతో... ఆ వీడియోపై నెటిజన్ల నుంచి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే...
రెండోసారి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ యువకుడిపై రణ్‌బీర్ కపూర్ కోప్పడ్డాడు. ఏకంగా ఆ వ్యక్తి ఫోన్‌ను దూరంగా విసిరేశాడు. తొలుత ఆ అభిమాని సెల్ఫీ అడగగా నవ్వుతూ పోజులిచ్చాడు రణ్‌బీర్. అయితే ఫొటో సరిగా రాకపోవడంతో మరోమారు సెల్ఫీ తీయడానికి ప్రయత్నించాడు. దీంతో రణ్‌బీర్‌కు కోపం వచ్చింది. ఫోన్ చూడటానికి అడిగినట్లు అడిగి.. తీసుకొని విసిరేశాడు.
ఇదంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జరిగిన దానిని చూసిన అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ సంఘటన ఏదైనా ఫోన్ బ్రాండ్ ప్రచారానికి సంబంధించింది కావొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే రణ్‌బీర్ అలాంటివాడు కాదని, ఈ వీడియోను నమ్మొద్దని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే ఇది సరైన పద్ధతి కాదు అని ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు
-
India News
Sukesh chandrasekhar: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్