Dussehra: ‘విట్‌‌’లో రోబోల ఆయుధ పూజ.. వీడియో చూశారా?

కాలం శరవేగంగా మారుతోంది.. శాస్త్రసాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతుండటంతో ప్రపంచమంతా ‘యంత్రం’పైనే నడుస్తోంది. దాదాపు అన్ని రంగాలూ ఆటోమేషన్‌కు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రోబోలు రంగప్రవేశం చేసి ఆకట్టుకుంటున్నాయి.......

Published : 04 Oct 2022 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలం శరవేగంగా మారుతోంది.. శాస్త్రసాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతుండటంతో ప్రపంచమంతా ‘యంత్రం’పైనే నడుస్తోంది. దాదాపు అన్ని రంగాలూ ఆటోమేషన్‌కు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రోబోలు రంగప్రవేశం చేసి ఆకట్టుకుంటున్నాయి. కృత్రిమ మేధలో వస్తోన్న విప్లవాత్మక మార్పులతో అన్ని పనులనూ ఈ మరమనుషులే చక్కబెట్టేస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక రంగంలోకీ రోబోలు వచ్చేశాయ్‌..!  వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(VIT)లో జరిగిన దసరా వేడుకలే ఇందుకు నిదర్శనం. వెల్లూరులోని ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో రోబోలు దసరా ఆయుధ పూజ నిర్వహించాయి. ఒక రోబో గంట మోగించగా.. మరో రోబో దుర్గా మాతకు హారతి సమర్పించే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. దుర్గామాతకు హారతి ఇచ్చిన తర్వాత భక్తులు ఆ రోబో వద్దకు వెళ్లి హారతి తీసుకున్న వీడియోలను VIT సంస్థ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది.




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని