Viral video: మైమరిపిస్తోన్న బెరియోజ్కా ‘ఫ్లోటింగ్‌’ డ్యాన్స్‌.. వావ్‌ అంటోన్న నెటిజన్లు!

సామాజిక మాధ్యమాల్లో రోజూ అనేక వీడియోలు ఓ ప్రవాహంలో వచ్చి పడుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని ఆయా సందర్భాలను బట్టి జనాదరణ పొందితే.. ఇంకొన్ని వీడియోలు అసాధారణ ప్రదర్శనతో ప్రేక్షకుల మదిని కొల్లగొడుతుంటాయి.

Updated : 17 Nov 2022 17:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో రోజూ అనేక వీడియోలు ఓ ప్రవాహంలా వచ్చి పడుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని ఆయా సందర్భాలను బట్టి జనాదరణ పొందితే.. ఇంకొన్ని వీడియోలు అసాధారణ ప్రదర్శనతో ప్రేక్షకుల మదిని కొల్లగొడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెటిజన్లను మైమరిపించేలా చేస్తోంది. రష్యా జానపద నృత్య కళారూపమైన బెరియోజ్కా కళాకారులు ఓ వేదికపై చేసిన ప్రదర్శన కనులవిందు చేస్తోంది. నృత్యకారిణుల బృందం ఎర్రని గౌనులు ధరించి ఒకేసారి తమ పాదాలను వేగంగా, అతి సున్నితంగా కదుపుతూ లయబద్ధంగా వేదికపై తేలియాడుతున్నట్టుగా కనిపిస్తున్న దృశ్యాలు ప్రేక్షకుల మతి పోగొడుతున్నాయి. ఈ అసాధారణ ప్రదర్శన వీడియో నెటిజన్లను మంత్రముగ్దుల్ని చేస్తోంది. 

కొందరు నృత్యకారిణులు ఓ బృందంలా ఏర్పడి చేసే బెరియోజక్కా/ బెరెజ్కా నృత్య ప్రదర్శనను 1948లో అప్పటి సోవియట్‌ యూనియన్‌లో రష్యన్‌ కొరియోగ్రాఫర్‌, నృత్యకారిణి నదేజ్దా నదేజ్దినా రూపకల్పన చేశారు. పొడవైన గౌనులు ధరించి వేదికపై లయబద్ధంగా తేలియాడుతున్నట్టుగా కనిపించి ప్రేక్షకుల్ని మైమరిపించడం ఈ నృత్య రూపకం ప్రత్యేకత. అయితే, ఈ వీడియోను తాజాగా Historic vids అనే ట్విటర్‌ హ్యాండిల్‌ నుంచి పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. కేవలం 16 గంటల వ్యవధిలోనే 30లక్షల మంది వీక్షించడం విశేషం. ఈ వీడియోను చూసిన అనేకమంది నెటిజన్లు ‘వావ్‌.. అద్భుతం.. ట్రూమూన్‌వాక్‌’ అంటూ పలు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు ఔత్సాహికులైతే బెరెజ్కా నృత్యకారిణులను అనుసరిస్తూ రిహార్సల్స్‌ చేస్తున్నట్టుగా వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు.







గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు