Viral Video: ఆమె కంట్లో ఏకంగా 23 లెన్సులు.. నిర్ఘాంతపోయిన వైద్యురాలు

ఓ మహిళ కంటిపై నుంచి పదుల సంఖ్యలో కాంటాక్ట్‌ లెన్సులను ఓ వైద్యురాలు బయటకు తీశారు. అసలు విషయాన్ని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Updated : 14 Oct 2022 21:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంట్లో నొప్పితో ఓ మహిళ స్థానిక ఆసుపత్రిని సంప్రదించగా.. ఆమె కంటిపై పొరలకొద్దీ ఉన్న కాంటాక్ట్‌ లెన్సులను గుర్తించిన వైద్యురాలు నిర్ఘాంతపోయింది. ఆపై చికిత్స ప్రారంభించి వాటిని తీస్తున్నాకొద్దీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇలా ఏకంగా 23 లెన్స్‌లను కంటిపై నుంచి విజయవంతంగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆ వైద్యురాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది.

కంటిపై ప్రతిరోజు లెన్సులు ధరించే సదరు మహిళ.. రాత్రి వాటిని తొలగించుకోకుండా నిద్రపోయి, తిరిగి ఉదయం కొత్తవాటిని పెట్టుకోవడమే ఇందుకు కారణమని వైద్యురాలు వెల్లడించారు. లెన్స్‌లు తొలగించుకోవడం మర్చిపోతూ 23 రోజులుగా ఇలా చేసినట్లు తెలిపారు. ‘రాత్రిపూట కాంటాక్ట్ లెన్స్‌లను తీసివేయడం మరచిపోయి, ఉదయం కొత్తది పెట్టుకోవడం అరుదైన సందర్భం. ఇలా వరుసగా 23 రోజులు. నా క్లినిక్‌లో వాటిని విజయవంతంగా తొలగించా’ అంటూ ఆ వైద్యురాలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. లెన్సులతో నిద్రపోవద్దు అంటూ సూచించారు. కాగా లెన్సులు తొలగిస్తున్న ఆ వీడియో వైరల్‌గా మారి ఇప్పటికే దాదాపు 3 మిలియన్ల మంది వీక్షించారు. 82 లక్షల మంది లైక్‌ చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని