Viral Video: చెన్నై అమ్మాయిల సరదా పని..! బకెట్లు.. డబ్బాలు.. కుక్కర్‌లతో కాలేజీకి..

ఓ కళాశాలలో విద్యార్థినులు చేసిన సరదా పని నవ్వులు పూయిస్తోంది. ‘నో బ్యాగ్‌ డే’ రోజు వారు బకెట్లు, పేపర్‌ డబ్బాలు, ప్రెషర్‌ కుక్కర్‌లతో కాలేజీకి రావడం గమనార్హం.

Published : 30 Mar 2023 23:39 IST

చెన్నై: కాలేజీ లైఫ్‌(College Life) అంటేనే.. ఎన్నో సరదా పనులు.. మరెన్నో జ్ఞాపకాలు. చేసే పనే కాస్త విభిన్నంగా చేస్తే.. వినోదానికి కొదవ ఉండదు! తమిళనాడు రాజధాని చెన్నై(Chennai)లోని ఓ కళాశాల విద్యార్థులు ఇలాగే ఆలోచించారు. ‘నో బ్యాగ్‌ డే(No Bag Day)’ రోజున కాస్త వినూత్న బాట పట్టారు. ఈ క్రమంలోనే వారు చేసిన సరదా చేష్టలు నవ్వులు పూయిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌(Viral Video)గా మారింది.

చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థినులు.. ‘నో బ్యాగ్‌ డే’ రోజున.. కాలేజీ బ్యాగ్‌కు బదులుగా సరదాగా ప్రెషర్‌ కుక్కర్‌, బకెట్లు, పేపర్‌ డబ్బాలు, భారీ లగేజీ బ్యాగులు, ప్లాస్టిక్‌ బుట్టలవంటివి పట్టుకురావడం గమనార్హం. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సదరు విద్యార్థినులు తమ వెంట తీసుకొచ్చిన వస్తువులు, ఈ క్రమంలో వారి హావభావాలు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఈ అమ్మాయిలు క్రియేటివ్‌గా ఆలోచించారంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ‘నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే బాగుండేది. జూనియర్లు.. మీరు అదరగొట్టేశారు’ అని అదే కళాశాలలో చదువు పూర్తిచేసిన ఒకరు స్పందించారు. తాము ఏ రోజూ బ్యాగు తీసుకెళ్లలేదంటూ కొందరు తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని