Viral video: మొసళ్లు VS బాలుడు.. ఎలా కాపాడారో చూడండి!

అనుకోని పరిస్థితుల్లో ఒక్క మొసలి తారసపడితేనే.. వామ్మో అనుకుంటూ ప్రాణభయంతో పరుగులందుకుంటాం. అయితే, ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయిన ఓ బాలుడిని........

Published : 26 Aug 2022 20:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుకోని పరిస్థితుల్లో ఒక్క మొసలి తారసపడితేనే.. వామ్మో అనుకుంటూ ప్రాణభయంతో పరుగులందుకుంటాం. అయితే, ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయిన ఓ బాలుడిని కొన్ని మొసళ్లు వెంబడిస్తే? ప్రాణభయంతో అల్లాడుతున్న అతడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ మొసళ్ల నుంచి తప్పించుకుంటూ మునిగిపోతున్న ఆ బాలుడిని ఓ బృందం వీరోచితంగా కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం  వైరలవుతోంది.

ఓ బాలుడు ప్రమాదవశాత్తూ చంబల్‌ నదిలో పడిపోయాడు. అయితే, ఓ మొసళ్ల గుంపు అతడిని వెంబడించింది. నీటిలో మునుగుతూ, తేలుతూ ఆ బాలుడు ప్రాణభయంతో అరుస్తుండటాన్ని.. పడవలో అటుగా వెళుతున్న కొందరు గుర్తించారు. వెంటనే వచ్చి అతడిని కాపాడారు. కాస్త ఆలస్యమైనా అతడు ఆ మొసళ్లకు ఆహారమైపోయేవాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఆర్‌ఎస్ అధికారి భగీరథ్‌ చౌదరి ట్వీట్‌ చేశారు. భయానక పరిస్థితుల్లో ఉన్న బాలుడిని రక్షించిన ఆ బృందాన్ని ప్రశంసించారు. కాగా ఈ వీడియో వైరల్‌గా మారింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు