Italy Circus: పులి నోట చిక్కిన సర్కస్ ట్రైనర్.. ఇటలీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన!
రోమ్: ఇటలీ(Italy)లోని ఓ సర్కస్(Circus)లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఎప్పటిలాగే ప్రదర్శన ఇస్తున్న సర్కస్ శిక్షకుడిపై అక్కడున్న ఓ పులి(Tiger) అకస్మాత్తుగా దాడి చేసింది. అప్పటివరకు ప్రదర్శనను ఆస్వాదించిన ప్రేక్షకులు.. అంతలోనే ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా హతాశులయ్యారు! ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్(Viral Video)గా మారింది.
ఇక్కడి లెక్సే ప్రావిన్స్‌లోని మెరీనా ఓర్ఫీ సర్కస్‌లో ఇవాన్ ఓర్ఫీ అనే 31 ఏళ్ల ట్రైనర్.. ఇటీవల రెండు పులులతో ప్రదర్శన ఇస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ పులిపై దృష్టి కేంద్రీకరించాడు. అంతలోనే వెనుకనుంచి వచ్చిన మరో పులి అతనిపై దాడి చేసింది. అతన్ని కిందికి లాగేసి.. మెడ, కాళ్లను నోటకరుచుకుంది. అతను నొప్పితో అరుస్తూ.. పులి నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన అతని సహాయకుడు.. ఆ పులిని నియంత్రించాడు.
ఈ ఘటనలో ఓర్ఫీ మెడ, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు అతడికి ప్రాణాపాయం తప్పినట్లు సర్కస్ యాజమాన్యం తాజాగా తెలిపింది. మరోవైపు.. పులిని ఐసొలేషన్‌లో ఉంచినట్లు చెప్పింది. దానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ