Fat loss: లావుగా ఉన్నావంటూ గర్ల్‌ఫ్రెండ్‌ ఛీత్కారం.. ఆపై అతడు ఎలా మారాడో చూశారా..?

లావుగా ఉన్నావంటూ హేళన చేసినవారికి.. అదే కారణంతో తనను విడిచి వెళ్లిన ప్రియురాలికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడో యువకుడు.......

Updated : 23 Aug 2022 20:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లావుగా ఉన్నావంటూ హేళన చేసినవారికి.. అదే కారణంతో తనను విడిచి వెళ్లిన ప్రియురాలికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడో యువకుడు. 144కిలోలు ఉండే అతడు, 74కిలోలకు చేరిపోయాడు. అంటే.. అతడు ఏకంగా 70కేజీలు తగ్గాడన్నమాట. ఆ యువకుడి ‘మార్పు’నకు సంబంధించిన పలు వీడియోలు వైరల్‌గా మారాయి. గతంలో టిక్‌టాక్‌ వీడియోలు చేసే పవి గతేడాది జనవరికి ముందు భారీకాయంతో ఏకంగా 144కేజీలు ఉండేవాడు. దీంతో అనేకసార్లు అవమానాలకు గురయ్యాడు. లావుగా ఉన్నాడంటూ గర్ల్‌ఫ్రెండ్‌ సైతం అతడిని వదిలేసి వెళ్లిపోయింది.

దీన్ని తీవ్ర అవమానంగా భావించిన పవి.. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఓ వ్యాయామశాలలో చేరి వర్కౌట్లు చేయడం ప్రారంభించాడు. జిమ్‌లో గంటలకొద్దీ తీవ్రంగా కష్టపడుతూ శరీర బరువును ఏకంగా 70కిలోలు తగ్గించుకున్నాడు. ఏడాది కాలంలో తనను  పూర్తిగా మార్చుకుని ఇప్పుడు ఎంతో ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుత, గత ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ‘నాకు నేనే ఓ కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నా. ఒకప్పుడు ఎంతో నీరసంగా ఉండేవాడిని. జనం సైతం నన్ను హేళనగా చూసేవారు. కానీ ఇప్పుడు నా జీవితం తిరిగొచ్చింది. ఆత్మవిశ్వాసంతో ఉంటున్నా’ అని పేర్కొన్నాడు.





గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని