Anand Mahindra: బాటిల్‌తో వినూత్న ఆవిష్కరణ.. ఆనంద్ మహీంద్రా ఫిదా!

సామాజిక మాధ్యమాల వేదికగా స్ఫూర్తిమంత కథనాలు, ఎన్నో కొత్త విషయాలను పంచుకునే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.. తాజాగా ఓ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు...

Published : 04 Jun 2022 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల వేదికగా స్ఫూర్తిమంత కథనాలు, ఎన్నో కొత్త విషయాలను పంచుకునే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.. తాజాగా ఓ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. నిలబడిన చోటు నుంచే చెట్ల నుంచి పండ్లను తెంచేందుకు వీలుగా ప్లాస్టిక్‌ బాటిల్‌, దారాలతో ఇంటిదగ్గరే ఓ పరికరాన్ని ఎలా రూపొందించవచ్చో ఈ వీడియో వివరిస్తుంది. ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు.. ఇప్పటి వరకు 4.8 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

‘‘ఇది భూమిని కదిలించే ఆవిష్కరణ కాదు. కానీ, దీని పట్ల ఆసక్తిగా ఉన్నా. ఎందుకంటే.. పెరుగుతున్న ‘వినూత్న పరిష్కారాల సంస్కృతి’ని ఇది ప్రదర్శిస్తోంది. చాలా మంది తమ ఇళ్లలో, వర్క్‌షాప్‌లలో ప్రయోగాలు చేసే అలవాటు కారణంగానే.. అమెరికా ఆవిష్కరణల కేంద్రంగా మారింది. సరికొత్త పరిష్కార మార్గాలు చూపేవారు.. ఆవిష్కరణల వీరులు కావచ్చు’’ అని రాసుకొచ్చారు. మరోవైపు నెటిజన్లు.. ఆనంద్‌ మహీంద్రా ప్రోత్సాహన్ని కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు.  విభిన్నంగా ఆలోచించేవారిదే భవిష్యత్తు అని స్పందిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని