Published : 24 Sep 2022 18:02 IST

Guinness World Record: ఈ సాహసం చూస్తే వామ్మో అనాల్సిందే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇద్దరు సాహసికులు చేసిన ఓ సాహసం గగుర్పాటుకు గురిచేస్తోంది. మండుతున్న అగ్నిపర్వతం పైనుంచి తాడు మీద ఎక్కువ దూరం నడిచి రికార్డు సృష్టించారు. అత్యంత కఠినమైన ఈ సాహసం ప్రతిష్టాత్మక గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది. రఫేల్ జుగ్నో బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్ అనే ఔత్సాహికులు చేసిన ఈ సాహసానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా ఈ క్లిప్పింగ్‌ నెటిజన్లను సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.

నైరుతి పసిఫిక్ మహాసముద్రం టాన్నా ద్వీపంలోని యసుర్ అగ్నిపర్వతంపై పొడవైన తాడు(స్లాక్‌లైన్‌)పై చెప్పులు లేకుండానే నడిచి ఆ ఇరువురు రికార్డు సృష్టించారు. యసూర్ పర్వతబిలంపైన 42 మీటర్ల (137 అడుగులు) ఎత్తులో ఈ స్లాక్‌లైన్‌ను ఏర్పాటు చేయగా.. హెల్మెట్లు, గ్యాస్‌ మాస్కులు ధరించిన రఫేల్‌, అలెగ్జాండర్‌ 261 మీటర్ల దూరం నడిచి ఈ రికార్డు నెలకొల్పారు. కాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 3లక్షల మంది వీక్షించారు. ఈ సాహసికులను కొనియాడుతూ అనేకమంది కామెంట్లు చేస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts