Viral Video: యాత్రికుల బోట్లపై భారీ రాతి ఫలకం ఎలా పడిందో చూడండి!

అది అందమైన సరస్సు. చుట్టూ ఎత్తైన రాతి కొండలు. వాటిపై పచ్చని చెట్లు. పైనుంచి భారీగా జాలువారుతున్న జలధార. ఇలాంటి ప్రకృతి రమణీయతను వీక్షించాలని ఎవరు మాత్రం అనుకోరు. బ్రెజిల్‌లో ఈ ప్రకృతి సోయగాలను చూసేందుకు వచ్చిన యాత్రికుల బోటుపై భారీ రాతి పలకలు విరిగిపడటంతో... ఆ యాత్రికుల వారాంతపు విహార యాత్ర విషాద యాత్రగా మిగిలింది.

Updated : 09 Jan 2022 15:31 IST

రియో డి జనీరో: బ్రెజిల్‌లోని మినాస్‌ గేరియాస్‌ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫర్నాస్‌ సరస్సులో ఘోర ప్రమాదం జరిగింది. సరస్సులో ప్రయాణిస్తూ ప్రకృతి సోయగాలకు మైమరిచిపోతున్న పర్యాటకుల బోట్లపై ఒక్కసారిగా పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మూడు బోట్లపై రాతి పలకలు అకస్మాతుగా పడటంతో ఘటనా స్థలిలోనే ఆరుగురు యాత్రికులు మరణించారు. 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గల్లంతైన  మరో 20 మంది కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా వారాంతం కావడంతో ఫర్నాస్‌ సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారని అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దాని వల్లే కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. ప్రమాద ఘటనపై బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని